విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!

ఠాగూర్

సోమవారం, 12 మే 2025 (12:10 IST)
అమెరికాలో ఓ టీచరమ్మ చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థులను లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. ఈ కేసును విచారించిన అమెరికా కోర్టు ఆమెకు 30 యేళ్ల జైలుశిక్షి విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికా, శాండియాగోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూలులో జాక్వెలిన్ మా (36) అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈమె శాండియాగాలో అత్యుత్తమ టీచర్ అవార్డును సైతం గెలుచుకుంది. అయితే, జాక్వెలిన్ తన పాఠాలు చెప్పే 12 యేళ్ళ విద్యార్థిపై కన్నేసింది. బాలుడుకి ప్రేమ పాఠాలు వల్లిస్తూ, మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. పైగా, తాను చెప్పినట్టుగా వినేలా ఖరీదైన బహుమతులను సైతం ఇచ్చింది. ఆ తర్వాత ఆ బాలుడుతో ఏకాంతంగా కామకోర్కెలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. అలా పది నెలల పాటు ఎఫైర్ కొనసాగించింది. 
 
ఈ క్రమంలో తమ కుమారుడు స్కూలు నుంచి ఆలస్యంగా రావడంతో పాటు ఫోనులో మునిగిపోవడం, టీచర్‌తో గంటల తరబడి చాటింగ్ చేస్తుండటంతో తల్లి అనుమానించి, కొడుకు చదువు చెప్పే టీచర్ జాక్వెలిన్ మా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుధీర్ఘ విచారణ తర్వాత జాక్వెలిన్ మా నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు 30 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విద్యార్థితో చేయకూడని పని చేసినందుకు ఇపుడు ఆ టీచరమ్మ జీవితాంతం జైలుజీవితాన్ని గడపనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు