తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఈ చిత్రం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేయగా, సూపర్బ్‌గా వచ్చిందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో నటించే అర్హత కంగనా రనౌత్‌కి లేదంటూ సంచలన ఆరోపణలు చేసింది తమిళ నటి మీరా మిథున్. తన ట్విట్టర్ వేదికగా కంగనాపై నిప్పులు చెరిగింది.
సుశాంత్ మరణం తర్వాత కంగనా.. నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు బాలీవుడ్ పెద్దల వలననే సుశాంత్ డిప్రెషన్‌కి గురై సూసైడ్ చేసుకున్నాడని పేర్కొంది. అయితే ఈ నెపోజిటం అనే పదం కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండగా, ఈ పదాన్ని తమిళ సినిమాకు ఆపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు.