ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. అయితే సినిమాల్లోకి వెళ్తానని.. హీరోయిన్ అవుతానని చెప్పిన వెంటనే.. ఇక పొసగదన్నాడు. అంతేకాదు.. సినిమాల్లోకి వెళ్తే పెళ్లి కాదన్నాడని.. పవన్ హీరోయిన్ నికిషా పటేల్ తెలిపింది. ప్రేమ, పెళ్లి గురించి ముందు ఆలోచించేదాన్నని.. అయితే ఇప్పుడు ఆ ఆలోచన లేదని.. తనకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని నికిషా పటేల్ వెల్లడించింది.
ఇంకా తన ప్రేమ గురించి నికిషా పటేల్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకముందు.. తాను, ఒక వ్యక్తి ప్రేమించుకున్నామని చెప్పింది. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. అయితే, తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడే లవ్‌కు బ్రేక్ పడిందని తెలిపింది. అతనికి తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని.. అందుకే గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడని నికిషా పటేల్ వెల్లడించింది.
అంతేగాకుండా సినిమాల్లోకి వెళ్తే మన పెళ్లి జరగదని కచ్చితంగా చెప్పేశాడని.. అప్పుడు తనకు పెళ్లి కన్నా సినిమాల్లోకి రావడమే ప్రధాన లక్ష్యంగా కనిపించిందని, అతనితో ఆ విషయం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా ఇద్దరం విడిపోయామంది. అన్నీ తెలిసే అతన్ని వదులుకున్నాను. సినిమాల్లో వచ్చినా సక్సెస్ కాలేకపోయానని పవన్ హీరోయిన్ అయిన నికిషా పటేల్ చెప్పుకొచ్చింది. కాగా కొమరం పులి సినిమాలో పవన్ సరసన నికిషా పటేల్ నటించిన సంగతి తెలిసిందే.