'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత 2014లో వచ్చిన 'మనం' చిత్రంలో ఆమె కనిపించింది. అక్కడ నుంచి ఆమె సినీ కెరీర్ తిరుగులేకుండా సాగుతోంది. 'బెంగాల్ టైగర్', 'సుప్రీం' వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో చివరగా నటించిన చిత్రం 'వెంకీమామ'. ఈ చిత్రంతోపాటు 'శ్రీనివాస కళ్యాణం', 'ప్రతి రోజూ పండగే' వంటి చిత్రాల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, 'ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు .. స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం మరో కారణం.