సాధారణంగా అబ్బాయిలు గెడ్డం గీయించుకోవడం తెలుసు కానీ అమ్మాయిలు చేయించుకోవడం ఎప్పుడైనా.. వినున్నారా... అది ఓ హీరోయిన్ గడ్డం గీయించుకోవడం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ గెడ్డం మ్యాటర్ తెలుసా... ప్రభాస్ సరసన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లిగా... 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో విలన్‌కు భార్యగా నటించిన సంజన ఇటీవల ఓ బార్బర్ షాప్‌కు వెళ్లి గెడ్డం గీయించుకోవడం అది వీడియో తీసి, తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ముఖంపై కూడా అవాంఛిత రోమాలు ఉంటే తన గ్లామర్ దెబ్బతింటుందని భావించిందో ఏమో గాని... తన వ్యక్తిగత మేకప్ మెన్‌తో గడ్డం గీయించుకుంది. వెండితెరపై మరింత అందంగా కనపడటానికి, ఎప్పటికప్పుడు నీట్‌గా గడ్డం గీయించుకుంటోంది. షేవింగ్ క్రీమ్ ఉపయోగించకుండా తన మేకప్ మెన్‌తో సంజన గడ్డం గీయించుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సంజన…''డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్… బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్'' అని స్పందించింది!! ఇక మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి..