టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో అడవి శేష్ ఒకరు. ఆయన ఎప్పుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడవి శేష్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తను ఇంతకుముందు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదని.. ప్రస్తుతం పెళ్లి గురించి యోచిస్తున్నట్లు తెలిపాడు.
అంతేగాకుండా.. తను ప్రస్తుతం ఓ యువతితో డేటింగ్‌లో ఉన్నానని వెల్లడించాడు. ఆ అమ్మాయిది హైదరాబాదేనట. తను ఎవరో? ఏం చేస్తుందో? అనే విషయాలు సమయం వచ్చినప్పుడు చెబుతా.. అని ఆ విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టేశాడు. తన పెళ్లి గురించి తనకంటే ఎక్కువగా తన ఫ్యామిలీ మెంబర్స్ తొందరపడుతున్నారని.. ఎలాగైనా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలని తనను ఒత్తిడి చేస్తున్నారన్నాడు.