అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు... సిద్ధిపేట జిల్లా రామారుకుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజావర్మ, శ్రీయా వర్మ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
శ్రీనివాస్ వర్మ దంపతులు జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వసల వచ్చారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవరుగా పని చేస్తుంట, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె శ్రీజా వర్మ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లింది. ఈ మధ్యే ఎంఎస్ పూర్తి చేసింది.
అయితే, భారతకాలమానం ప్రకారం సోమవారం రాత్రి అపార్టుమెంట్ నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ తన పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ ప్రాణాలు కోల్పోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు.