అనుష్క శెట్టి బాటలో ఐశ్వర్య లక్ష్మి.. సోషల్ మీడియాకు బైబై

సెల్వి

మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (15:13 IST)
Aishwarya Lakshmi
నటి అనుష్క శెట్టి సోషల్ మీడియాకు బైబై చెప్పేసింది. ప్రస్తుతం ఇదే బాటలో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ వార్త ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. సెలెబ్రిటీలు సోషల్ మీడియాను విడిచిపెట్టడం చిన్న విషయం కాదు. 
 
ఈ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా సినిమాలను ప్రోత్సహించడానికి, ఇమేజ్‌ కోసం, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అయితే గోప్యత సోషల్ మీడియా దూరంగా వుంటుంది. 
 
అందుకే హీరోయిన్లు ప్రస్తుతం ప్రైవసీ కోసం సోషల్ మీడియాను వదిలి పెడుతున్నారు. ప్రస్తుతం అనుష్క తరహాలోనే ఐశ్వర్య లక్ష్మీ కూడా సోషల్ మీడియాకు బైబై చెప్పేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు