ఎన్టీఆర్.. కొరటాల శివ చిత్రంతో పాటు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కూడా మరో సినిమా చేయనున్నారని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే నెల 11న అధికారికంగా ప్రకటన వెలువడనుందని టాక్ వస్తోంది.
క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నారు.
కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని తెలిసింది. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు తెలిసింది.
ఈ సినిమా ద్వారా సోనాలీ బింద్రే రీ ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. తారక్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రాదించారట.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవ్వడం, కథ నచ్చడం వల్ల ఆమె కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.