బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులను నటి చార్మి దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రం షూటింగులో చార్మి చాలా యాక్టివ్‌గా వుండటం, పలు విషయాలు దర్శకుడు పూరీతో కలిసి చర్చించడం, ప్లాన్లు వగైరా చేస్తూ ఇద్దరూ చాలా బిజీగా వుంటున్నారట.
ఇదేదో ఎఫైర్‌కి దారి తీసిందంటూ టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు... చార్మి ఏకంగా పూరీ జగన్నాథ్ ఇంటికి వచ్చిందనీ, ఆ సమయంలో ఇంట్లో వున్న పూరీ భార్య గట్టగా కేకలు వేస్తూ వ్యవహారం ఇంటి దాకా వస్తే బావుండదంటూ మండిపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా... చార్మి-పూరీ వ్యవహారంపై బాలయ్య కూడా మండిపడినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో కానీ వార్తలు మాత్రం వెల్లువలా ప్రవహిస్తున్నాయి.