బిజినెస్‌లోనూ దూకుడుగా ఆర్‌.ఆర్‌.ఆర్‌.

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:02 IST)
NTR, Ramcharan, RRR
రాజ‌మౌళి ద‌ర్శ‌కుడేకాదు. మంచి బిజినెస్‌మేన్ కూడా. పెద్ద ఖ‌ర్చులేకుండా ప‌బ్లిసిటీ ఎలా చేయాలో ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని సినీవిశ్లేష‌కులు అంటారు. ఈ విషయాన్ని `బాహుబ‌లి` నిరూపించింది. ఏ దిన‌ప్ర‌తిక‌లోనూ, వార ప‌త్రిక‌లోనూ యాడ్ ఇవ్వ‌కుండానే ఆయ‌న‌కు ప‌బ్లిసిటీ ఇచ్చారు. అదే మిగిలిన ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాలు ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే ప‌బ్లిసిటీ పెద్ద‌గా రాదు. అందుకే అంతో ఇంతో సోష‌ల్‌మీడియాను అప్‌డేట్‌చేసే కొంత‌మందిని ఆయ‌న టీమ్‌గా పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు క‌లిసివ‌చ్చింది. ఈ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌. రామ్‌చ‌ర‌ణ్‌తోపాటు బాలీవుడ్ అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌ సహా హాలీవుడ్‌ తారలు ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని ఇలా భారీ తారాగణం వున్నారు.
 
ఇంత‌మంది న‌టిస్తున్న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాలి క‌నుక రాజ‌మౌళికి వున్న బిజినెస్ మంచి క్రేజ్ వ‌చ్చేసింది. అక్టోబర్‌ 13న ద‌స‌రానాడు ఈ సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు భారీగానే ఖ‌ర్చ‌యింది. దాదాపు 400 రూపాయ‌లు ఖ‌ర్చ‌యిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌లో టాక్‌. ఓ అగ్ర నిర్మాత చెప్పిన‌దానిని బ‌ట్టి ప్రీ రిలీజ్‌కు ముందే ఈ సినిమా 550 రూపాయ‌ల‌కు పైనే బిజినెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ఇక్క‌డ రూపాయి అంటే కోటి కింద లెక్క‌. చాలామంది కోట్ల‌ను రూపాయ‌ల బాష‌లో చెబుతుంటాడు. ఈ ప‌దాన్ని డా. డి.రామానాయుడు ఎక్కువ‌గా వాడేవారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే, రాజ‌మౌళికి బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసే పెద్ద టీమ్ వుంది. అందులో ఎం.బి.ఎ., సాఫ్ట్‌వేర్‌కు చెందిన ప‌లువురు వున్నారు కూడా. ముఖ్యంగా సినిమాను మార్కెటింగ్‌ చేసే విషయంలో ఆయన చాలా కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌’ను రూ.400 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను రూ.550 కోట్లకు విక్రయించేలా ప్లాన్‌ చేశారట.

అంతా అనుకున్నట్లు జరిగితే బాహుబలి 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్రాస్‌ చేస్తుందని వార్త వినిపిస్తోంది. అందుకు తగినట్లుగానే ప్రాంతాల వారీగా భారీ రేట్స్‌ను చెబుతున్నారని స‌మాచారం. ముఖ్యంగా కాంబినేష‌న్‌ప‌రంగా ఇది వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని పంపిణీదారులు కూడా ముంద‌డుగు వేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆంధ్ర రైట్స్ రూ.165 కోట్లు, తెలంగాణ  రూ.75 కోట్లు, క‌ర్ణాట‌క రూ.45 కోట్లు, కేర‌ళ రూ.15 కోట్లు, త‌మిళ‌నాడు రూ.50, హిందీ రూ.100 కోట్లు, ఓవ‌ర్ సీస్ రూ.70 కోట్లకు విక్రయించేలా ప్లాన్ చేశారట. ఇదే జ‌రిగితే బిజినెస్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించడం ఖాయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు