అక్కినేని నట వారసులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. అయితే అన్నయ్య చైతూ కంటే ముందు.. తమ్ముడు అఖిల్ పెళ్ళి జరుగుతుందని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత వివాహం తేదీ దాదాపు ఖరారైందని.. దీన్నిబట్టి చూస్తే.. అఖిల్ వివాహం ముందు.. ఆపై చైతూ-సమ్మూ వివాహం జరుగనుందని టాక్ వస్తోంది.
కాగా, డిసెంబర్ 9న అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ వివాహ నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించడంలో అక్కినేని నాగార్జున బిజీబిజీగా ఉన్నారు. అఖిల్ నిశ్చితార్థం డిసెంబరులో జరుగనుండగా, శ్రేయాభూపాల్‌తో అఖిల్ వివాహం మాత్రం రోమ్‌లో వచ్చే ఏడాది మేలో జరుగనుందని చైతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అయితే ఆగస్టు ఒకటో తేదీన నాగచైతన్య, సమంతల వివాహం జరగనుందని, తొలుత హిందూ సంప్రదాయంలో వివాహం జరిగిన అనంతరం క్రైస్తవ పధ్ధతిలో జరగనుందని సమాచారం. దీంతో అక్కినేని వారింట డిసెంబర్‌లో మొదలైన వివాహ సందడి ఆగస్టు వరకు కొనసాగేలా కనిపిస్తోంది. కానీ అఖిల్‌కు ముందు.. తర్వాత చైతన్యకు చేయడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమ్మూ-చైతూల వివాహం ముగిశాక అఖిల్ వివాహం జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.