ఆ విష‌యంలో నాగార్జున త‌ప్పు చేసాడా..?

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (20:57 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 సినిమా చేస్తున్నారు. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పోర్చుగ‌ల్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన స్టిల్స్ సినిమా పైన అంచ‌నాల‌ను రెట్టింపు చేసాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నాగార్జున అయితే.. మ‌న్మ‌థుడు సినిమా టైమ్‌లో ఎలా ఉన్నాడో... ఇప్పుడు అలానే ఉన్నాడు. 
 
ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ఏంటంటే... మ‌న్మ‌థుడు సినిమా అనేది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం. అలాంటి సినిమా మ‌ళ్లీ తీయాల‌ని ట్రై చేసినా రాదు. అలాంటి సినిమాకి సీక్వెల్‌గా మ‌న్మ‌థుడు 2 అని సినిమా తీయ‌డం త‌ప్పైతే... దీనికి ద‌ర్శ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్‌ని ఎంచుకోవ‌డం మ‌రో త‌ప్పు అంటూ టాక్ వినిపిస్తోంది. 
 
ఈ టైటిల్‌తో సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటాడో లేదో అని సందేహాలు లేవనెత్తుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు