నా కోసం ప్రత్యేకంగా నాగ్ అది ఇచ్చాడు: రకుల్ ప్రీత్ సింగ్

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (19:33 IST)
మన్మథుడు సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయస్సు ఉన్నా కింగ్ నాగార్జున మాత్రం యువకుడిలాగే మన్మథుడు సినిమాలో కనిపించాడు. అందరినీ అలరించాడు. మన్మథుడు-1 సినిమా తరువాత మన్మథుడు-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
 
సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినీ యూనిట్‌కు పెద్ద పార్టీనే ఇచ్చాడు. అందరితో కలిసి నాగార్జున ఈ పార్టీలో పాల్గొన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా తన అభిమానులకు తెలిపింది. సినిమా షూటింగ్‌లో మేము బాగా ఎంజాయ్ చేశాం.
 
నా కోసం ప్రత్యేకంగా నాగ్ ఒక పార్టీని అరేంజ్ చేశారు. నేను, వెన్నెలకిషోర్, సినీ యూనిట్ మొత్తం బాగా ఎంజాయ్ చేశాం. మాపై నాగ్‌కు ఎంత అభిమానమో. నాగ్ అంటే నాకు గౌరవం. ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మన్మథుడు 2 సినిమాలో నా గ్లామర్ కన్నా నాగార్జున చాలా అందంగా కనిపిస్తారంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు