అయితే, తాజాగా సిద్ధార్థ్‌పై ఆలియా చేసిన కామెంట్స్ మరోసారి వారి మధ్య ఉన్నా అనుభందాన్ని బయటపెట్టింది. బాలీవుడ్‌లో 'కిస్సర్' అంటే ముందు గుర్తొచ్చేది ఇమ్రాన్ హాష్మీ. కానీ.. బాలీవుడ్ భామ ఆలియా భట్ మాత్రం సిద్ధార్థ్ మల్హోత్రానే బెస్ట్ కిస్సర్ అంటోంది. ఇటీవల నేహా ధూపియా నిర్వహించిన ఇంటర్‌వ్యూకి వెళ్ళిన ఆలియా..
బాలీవుడ్‌లో బెస్ట్ కిస్సర్ ఎవరన్న ప్రశ్నకు సమాధనం ఇస్తూ.. అర్జున్ కపూర్‌ని నేను ఒక్క సినిమాలో కిస్ చేశాను. అతను మంచి కిస్సర్. కానీ.. సిద్ధార్థ్ మల్హోత్రాతో నేను రెండుసార్లు ముద్దు సన్నివేశాల్లో నటించా. బెస్ట్ కిస్సర్ అనే అవార్డు ఇస్తే.. సిద్ధార్థ్‌కే ఇవ్వాలి' ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది భట్ వారసురాలు.
సిద్ధార్థ్ బెస్ట్ కిస్సర్ అంటూ ఆలియా కితాబు ఇవ్వడం బాలీవుడ్‌లో మళ్ళీ టాక్ అఫ్ ది టౌన్‌గా ఆలియా - సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ అంశంపై చర్చ ఆరంభమైంది. అలియా సినిమాల విషయానికి వస్తే.. ఇటివలే షారుక్ ఖాన్‌తో ఆమె నటించిన డియర్ జిందగీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది.