మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రంలో నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని ఆయన తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కన్ను ఈ చిత్రం రీమేక్‌పై పడింది. దీంతో మలయాళ హక్కులను చిరంజీవి తనయుడు హీరో కమ్ నిర్మాత రాంచరణ్ భారీ మొత్తానికే కొనుగోలు చేశారు.
అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఓ పాత్రలో అంటే చిరంజీవికి నమ్మినబంటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.