లిప్‌లాక్ సీన్స్‌లో లిప్‌స్టిక్ వాడటం బాగోదు... నేనైతే వాడను: అమలా పాల్

బుధవారం, 3 జనవరి 2018 (15:08 IST)
దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాక.. అతనికి దూరమై విడాకులు తీసుకుంది అమలా పాల్. భర్తతో విడాకులు తీసుకున్నాక సింగిల్‌గా వున్న అమలాపాల్.. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా వుంది. ఇటీవలే కొత్త సంవత్సరాదికి అదిరే లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు భారీగానే లైకులు వచ్చాయి. 
 
తిరుట్టుపయలె-2 సినిమాలో అందాలను బాగానే ఆరబోసిన అమలాపాల్.. నడుముపై కామెంట్స్ కూడా చేసింది. తాజాగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమలాపాల్ బోల్డుగా సమాధానం ఇచ్చింది.
 
ప్రస్తుతం లిప్ లాక్ సీన్స్ పండించేందుకు సిద్ధంగా వున్నానని తెలిపింది. కానీ ఆ సన్నివేశాల్లో లిప్‌స్టిక్ వాడటం బాగోదని.. అలాంటి సన్నివేశాల్లో తానైతే లిప్ స్టిక్ వాడనని తెలిపింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన లిప్ లాక్, లిప్ స్టిక్ కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు