నేను స్వలింగ సంపర్కుడిని కాదు.. పవన్‌నే పెళ్లాడుతా: రామ్ గోపాల్ వర్మ

ఆదివారం, 31 డిశెంబరు 2017 (08:26 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో పవన్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు. తానైతే పవన్ కల్యాణ్‌నే పెళ్లాడుతానని చెప్పాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ప్రపంచంలోని అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి, అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌లో ఉన్న పవన్‌ను మరో పక్కన పెడితే తాను పవన్‌నే పెళ్లాడతానని పేర్కొన్నాడు. 
 
పవన్ కల్యాణ్ ముందు పుట్టి ఇప్పుడు మనందరికీ ఎమోషన్స్ నేర్పుతున్నాడని, ''హ్యాట్సాప్ పీకే"అన్నాడు. సూపర్ స్టార్స్ అమితాబ్, రజనీకాంత్ కూడా పవన్ ముందు పనికిరారని కితాబిచ్చాడు. తన గత జన్మలో కూడా ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదని పవన్‌ను కొనియాడాడు. బ్రూస్‌లీకి పవన్ మొగుడులా వున్నాడని వర్మ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు.
 
ఇంకా  పవన్‌ కల్యాణ్‌ ముందు పుట్టాడా? ఎమోషన్‌ ముందు పుట్టిందా ? అనేది చెట్టు ముందా విత్తు ముందా?, కోడి ముందా ? గుడ్డు ముందా ? అనే ప్రశ్నలకు సమాధానం చెపుతా అన్నాడు. పవన్‌ ముందు పుట్టి అందరికీ ఇప్పుడు ఎమోషన్‌ నేర్పుతున్నాడంటూ వర్మ పొగడ్తలు కురిపించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు