బాబు పుట్టాక కొత్త ప్రియుడితో ఎమీ జాక్సన్ చెట్టాపట్టాల్
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (17:21 IST)
Amy Jackson
భారత్‌లో వరసబెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో లవ్ ట్రాక్ నడిపింది.
ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి అమీ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. జార్జ్ పనాయొటోతో లవ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. బాబు పుట్టాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు.
కానీ అమీ జాక్సన్ జార్జ్‌కు బైబై చెప్పేసిందని టాక్ వస్తోంది. తన ప్రియుడికి బ్రేకప్ ఇచ్చేసింది. బిడ్డతో కలిసి సమయం గడుపుతూ ఒంటరిగా వుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఎడ్ వెస్ట్విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వార్తలను నిజం చేసేలా కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని అమీ జాక్సన్.. తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న ఎన్నో అపురూపమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.