ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

సిహెచ్

గురువారం, 13 మార్చి 2025 (17:07 IST)
బీట్‌రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్‌రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్‌రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము.
 
బీట్‌రూట్ రసం అందరికీ మంచిది కాదు.
కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు.
తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్ రసం తాగడం మానేయాలి.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్‌రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు...
జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు