ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ సినిమాతో అంతకుమించి హడావిడి చేసింది హాట్ యాంకర్ రేష్మి. ఇది అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న రష్మి ఆ తరువాత అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుకే ఆ మూడ్‌లోనే ఎలాంటి సినిమా చేయడానికైనా రేష్మి సిద్ధంగా ఉందట. గుంటూరు టాకీస్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఆ తరువాత అందులోని రొమాన్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇదే విషయంపై గత మూడు రోజుల ముందు రేష్మిని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే నిజమేనందట రేష్మి. గుంటూరు టాకీస్ సినిమాలో నటించేటప్పుడే తాను సిద్థుతో ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నమాట వాస్తవమేనని చెప్పిందట రేష్మి. రేష్మి చెప్పిన మాటలతో ప్రస్తుతం తెలుగు సినీరంగం ఆశ్చర్యపోతోంది.