శ్రీముఖి అలాంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? హంటర్ రీమేక్‌లో ''ఎ'' స్టార్‌గా..?!

మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:30 IST)
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ, రేష్మి తర్వాత అంతటి రేంజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి. అందం, అభినయం, మాట తీరు హాట్ హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తుంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు టాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. 
 
బాలీవుడ్ విడుదలైన అడల్ట్ మూవీ 'హంటర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది. కథ పరంగా పలువురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతుంటారు. ఇందులో అవసరాలతో రొమాన్స్ చేసేందుకు శ్రీముఖి ఓకే చెప్పిందట.
 
రాధికా ఆప్టే చేసిన రోల్‌కి రెజీనాను ఎంపిక చేయగా, మరో క్యారెక్టర్‌కి యాంకర్ శ్రీముఖిని ఎంచుకున్నారు. శ్రీముఖి ఇలాంటి అడల్ట్ కంటెంట్ మూవీకి ఓకే చెప్పడంతో టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి