అనూ ఇమ్మాన్యుయెల్‌కి మళ్లీ ఛాన్స్

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:57 IST)
తెలుగులో నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యూయేల్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో అలరించింది. మళ్ళీ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశం కొట్టేసింది. 
 
అయితే ఈ ఇద్దరి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ భామ అడ్రస్ లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆ బ్యూటీకి కథ చెప్పిన డైరెక్టరూ లేరు.. కనీసం ఫలానా పాత్రలో అయినా చేయండని అడిగిన దాఖలాలు కూడా లేవు. అయితే టాలీవుడ్‌లో చేసింది అరకొర సినిమాలైనా తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది అను.
 
సినిమాలు లేకపోయినప్పటికీ అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రాంలో మాత్రం మంచి హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరించేది. అలా చేస్తున్న అనును పిలిచి మరీ ఒక డైరక్టర్ అవకాశమిచ్చారట. ఆయన మరెవరో కాదు సంతోష్ శ్రీనివాస్. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సంతోష్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఒకరు నభా నటేష్ అని.. మరొకరు అనును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు