రవితేజకు ఐ లవ్ యు చెప్పిన అనుపమా పరమేశ్వరన్... యూనిట్ షాక్...

మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:53 IST)
రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ఎవడో ఒకడు. వచ్చే నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంతోమంది యువ నటులతో నటించిన అనుపమ పరమేశ్వరన్ మెుదటిసారి ఓ సీనియర్ నటుడితో నటిస్తోంది. రవితేజ పెర్ఫార్మెన్సుకు అనుపమ ఫ్లాట్ అయ్యిందట. 
 
నేను ఎంతోమంది యువనటులతో నటించాను. కానీ మీ లాంటి నటుడిని అస్సలు చూడలేదు. చూడలేనేమో అని కూడా అనుకుంటా. మీరు సూపర్ రవితేజ అన్నయ్య... ఐ లవ్ యు అంటూ చెప్పిందట అనుపమ. అనుపమ ఆ మాట చెప్పగానే సినిమా యూనిట్ సభ్యులు అవాక్కయ్యారట. అయితే రవితేజ మాత్రం థ్యాంక్యూ చెల్లెమ్మా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారట. మరి రాఖీ ఏమైనా కట్టించుకున్నారో లేదో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు