బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట గురించి ఏవేవో రాసేసారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అయితే విపరీతమైన చర్చ జరిగింది. చివరికి అనుష్క పెదవి విప్పడంతో మేటర్ క్లోజ్ అయ్యింది. ఇకపోతే ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగులో బిజీగా వున్నాడు.
ఆమె బరువు చెక్ చేస్తే కనీసం 10 కేజీలకు పైగానే కావాల్సిన బరువు కంటే ఎక్కువగా వుందట. దానితో ఇప్పటికిప్పుడు 10 కేజీల బరువు తగ్గటానికి స్వీటీ నో చెప్పేసినట్లు సమాచారం. దాంతో అనుష్కను చిత్రం నుంచి తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. మళ్లీ సాహో చిత్రంలో హీరోయిన్ వేట షురూ అయిందని టాలీవుడ్ ఫలిమ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.