"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో చాలాకాలం తరువాత సక్సెస్ సాధించిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. వెంకీతో రానా కలిసి నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఒక హీరోయిన్‌గా అనుష్కను ఎంపిక చేశారు.
మరో హీరోయిన్ పేరును నవంబర్ 16వ తేదిన ప్రకటించనున్నారు.. అదే రోజున ఈ మూవీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే.ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వెంకీతో నటిస్తూనే అనుష్క మలయాళ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా పేరు సంపాదించిన అనుష్క.. మలయాళ సినిమాల గురించి మాట్లాడుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదని.. తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తున్నాయని తెలిపింది.