బీహార్‌లోని మధుబని జిల్లాలోని జయనగర్‌కు చెందిన ఒక ప్రైవేట్ కోచింగ్ టీచర్ విద్యార్థినులను బ్లాక్‌మెయిల్ చేసి, వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటాన్ని ఓ విద్యార్థిని ధైర్యంగా ఎదుర్కొంది. అతడి కామ పిశాచి రూపాన్ని ఆ అమ్మాయి ధైర్యం చేసి వీడియో రికార్డ్ చేసి వైరల్ చేసింది.
ఈ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు, ఉపాధ్యాయుడి పేరు రాకేష్ అని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కోచింగ్ పేరు వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇతడిపై ఆరోపణలు వచ్చినా బుకాయిస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో విద్యార్థిని అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేసింది.