అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. కారణం.. బాహుబలి టిక్కెట్లకు కులగజ్జి పట్టడమేనట. మా కులానికి చెంది హీరో.. టిక్కెట్ ధర ఇది అంటూ నిలబెట్టి నల్ల బజారు (బ్లాక్ మార్కెట్)లో అమ్ముతున్నారట కొందరు ఫ్యాన్స్. ఇందుకు ఉదాహరణే.. బాహుబలి-2 సినిమా ప్రీమియర్ షో టికెట్ ధర అక్షరాలా 3000 రూపాయలు పలకడమేనట! మామూలు షోలకు కూడా కాంబో టికెట్ల పేరుతో థియేటర్‌ను బట్టి రూ.300 నుంచి రూ.500, రూ.600 దాకా పెంచి విక్రయిస్తున్నాయి. ఇపుడ ఫ్యాన్స్ కూడా ఈ తరహా విక్రయాలకు పూనుకోవడంతో సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం చూసేందుకు మరో రెండు మూడు వారాల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా స్టార్ హీరోల కొత్త సినిమా వస్తోందంటే చాలు.. ఆ హీరో కులం, స్థాయి.. లేదా సినిమా స్థాయి.. ఇలా చాలా లెక్కలు తెరపైకి వస్తాయి. దీనికితోడు.. అభిమానులు తమ అభిమాన హీరో గురించి గొప్పలు చెప్పుకునేలా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచేయడం సర్వసాధారణంగా ఉన్న విషయం. ఇక బ్లాక్ టికెట్ల విక్రయాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.