బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకూ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చిన క్రిష్, ఇక్కడ శాతకర్ణి కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. శాతకర్ణిగా బాలకృష్ణ .. ఆయన తల్లిగా హేమమాలిని .. భార్యగా శ్రియ ఈ షూటింగులో పాల్గొంటున్నారు.
అంతే కాదు.. గతంలో తాను నందమూరి తారకరామారావు ఎన్టీఆర్‌తో కలిసి రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను కూడా గుర్తుచేసుకున్నారట. ఎన్టీఆర్‌తో కలిసి ''పాండవ వనవాసం'', ''శ్రీకృష్ణ విజయం'' చిత్రాల్లో నటించారు హేమమాలిని. ఆ రెండు పౌరాణికాలు కాగా.. ఇప్పుడు మళ్లీ రాజుల కాలానికి సంబంధించిన చిత్రంలో ఈమె తిరిగి తెలుగులో నటిస్తుండడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లోను 2017 సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.