తెలుగు, తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా కన్నడ సినీపరిశ్ర మరోమారు గళమెత్తింది. సినీనటుడు జగ్గేష్ చేసిన ట్వీట్ ఇందుకు ఆజ్యం పోసింది. డబ్బింగ్ చిత్రాలు విడుదల చేస్తే అది ప్రజల్లో ఆగ్రహానికి దారితీసి థియేటర్లను తగులబెట్టే పరిస్థితి రావొచ్చంటూ ఆయన హెచ్చరించారు.
కన్నడ సినీపరిశ్రమలో డబ్బింగ్ భూతానికి అనుమతి ప్రశ్నేలేదని కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ప్రకటించారు. కన్నడ సినీపరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉందని డబ్బింగ్‌కు అనుమతి మంజూరు చేస్తే కన్నడ కళాకారులు, నటులు ఎక్కడికి వెళ్ళాలని ఆయన ప్రశ్నించారు. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడే దిశలో డబ్బింగ్‌ను అందరూ వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.