ఇంతకీ ఆ పాత్రలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. బాహుబలి తల్లి పాత్ర శివగామిగా శ్రీదేవిని అడిగారట. ఐతే అందుకు శ్రీదేవి నో చెప్పిందట. దానితో ఆ పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ తర్వాత బాహుబలిలో కీలక పాత్ర కట్టప్ప. ఈ పాత్రకు తొలుత మలయాళ హీరో మోహన్ లాల్ ను అనుకున్నారట. ఆయనను సంప్రదిస్తే ఏడాదికే మూడు నాలుగు సినిమాలు చేసే మోహన్ లాల్, ఐదేళ్లపాటు ఒక్క సినిమా కోసమా అని తల అడ్డంగా ఊపారట. దాంతో ఆ పాత్రకు సత్యరాజ్ ను తీసుకున్నారట.
ఇక భల్లాల దేవ పాత్ర. ఈ పాత్రలో తొలుత వివేక్ ఒబెరాయ్ అయితే కరెక్ట్ అనుకున్నారట. ఆయన ఆ పాత్రలో చేయనని చెప్పడంతో రానాను అడిగారట. భల్లాల దేవ పాత్రకు ఎంత ప్రాముఖ్యత వచ్చిందో తెలియనిది కాదు. ఇక అవంతిక క్యారెక్టర్. ఈ పాత్రకు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ అయితే సరిపోతుందని సంప్రదిస్తే ఆమె కూడా రెండుమూడేళ్ల కాల్షీట్లు ఎవ్వరికీ ఇవ్వకుండా చేయడం కష్టమని నో చెప్పేసిందట. దానితో ఆ పాత్ర తమన్నాను వరించింది. ఇక చివరిగా దేవసేన పాత్ర.