ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ''బ్రహ్మోత్సవం''. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టిస్తోంది.
పోస్టర్‌లో మహేశ్‌బాబు కాజల్‌వైపు చూస్తుంటే.. ఆ చూపునకు కాజల్ సిగ్గు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి ఆమె నటించిన 'బ్రహ్మోత్సవం' కొత్త పోస్టర్‌ను తన ఫస్ట్ ట్వీట్‌గా సోషియల్ మీడీయాలో పోస్ట్ చేసింది కాజల్. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీవీపీ సినిమా, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 7న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.