ఇంతకీ పృథ్వీకి సంబంధించిన సీన్స్‌కి సెన్సార్ కత్తెరలు వేసిందా? లేక టైం కుదించడానికి మేకర్స్ దీన్ని తొలగించారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిరంజీవి ఎంట్రీ సీన్.. పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులు ఊహించని రీతిలో చూపించారని ఈ నేపథ్యంలో పృథ్వీకి సంబంధించిన సన్నివేశాలపై వేటు పడినట్టు లోగుట్టు సమాచారం.
అదేసమయంలో పోసాని కృష్ణమురళి పంచ్‌లు బాగున్నాయని, కాకపోతే బ్రహ్మానందం రోల్‌ని మరింత పెంచినట్లు టాక్. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నం.150' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న విజయవాడలో జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈవెంట్‌ను ఈనెల 7వ తేదీకి మార్చారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్స్‌లో జరుగనుంది.