భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

ఐవీఆర్

గురువారం, 8 మే 2025 (19:34 IST)
భారతదేశం-పాకిస్తాన్ (India Pakistan war) మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తను వెళ్లబోతున్నట్లు కె.ఎ.పాల్ (KA Paul) వెల్లడించారు. ఇటీవలే ఈ విషయంపై అమెరికాలోని 9 మంది అగ్ర నాయకులతో మంతనాలు జరిపాననీ, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
 
ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద వున్న నాది అని అన్నారు. టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందనీ, ఆపరేషన్ సింధూర్ ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తనవంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు. గతంలో కూడా పలు యుద్ధాలను నిలుపుదల చేయడం కోసం దౌత్యం చేసినట్లు చెప్పుకున్నారు.

పాకిస్తాన్ వెళ్తున్నాను.. యుద్ధాన్ని ఆపుతాను: కే.ఏ.పాల్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది.. కింద నాది.
టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ ను వద్దని వారించాను.
- కే.ఏ.పాల్ pic.twitter.com/0O6ZCOb0LN

— ChotaNews App (@ChotaNewsApp) May 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు