అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో దీపికా పదుకొణే

సోమవారం, 30 అక్టోబరు 2023 (19:42 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2024 నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం దీపికా పదుకొనే ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్. ఈ సినిమాలో పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక కానుంది. పూజ తీసుకుంటే అల వైకుంఠపురంలో మళ్లీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మరోసారి జతకట్టారు.
 
రాబోయే సినిమా వారి కాంబోలో వచ్చే నాలుగో సినిమా. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి, దీనికి థమన్ సంగీతం అందించనున్నారు. 
 
ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు