నాన్నా... మీ భాషలో చెప్పాలంటే.. ఇద్దరం పొరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం.. బన్నీ

ఆదివారం, 22 అక్టోబరు 2023 (17:00 IST)
పుష్ప చిత్రంలో అద్భుతమైన నటనకుగాను హీరో అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడు అవార్డును, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును దేవీశ్రీ ప్రసాద్‌లు అందుకున్నారు. అటు ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఏకంగా పలు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు విజేతలకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఇందులో అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ పార్టీలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'నాతో పాటు దేవి శ్రీ ప్రసాద్‌కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో మా నాన్న (అల్లు అరవింద్) చాలా సంతోషపడ్డారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉంది అంటూ పొంగిపోయారు. ఎందుకంటే ఇవాళ సత్యమూర్తి (దేవి శ్రీ ప్రసాద్ తండ్రి)గారు లేకపోవచ్చు... దేవి కూడా నా బిడ్డ లాంటివాడే... అతడు అవార్డు అందుకోవడాన్ని నేను చూడాలి అంటూ నాన్న ఢిల్లీ వచ్చారు. నాకు జాతీయ అవార్డు వచ్చినందుకు ఎంత ఆనంద పడ్డారో, అంతే సమానంగా, దేవికి అవార్డు వచ్చినందుకు కూడా ఆనందపడ్డారు.
 
అప్పుడు నేను మా నాన్నతో అన్నాను... నాన్నా నీ భాషలో చెప్పాలంటే... చెన్నైలో ఇద్దరు పోరంబోకులు... కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకోని వాళ్లం... ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా? అని అడిగాను' అంటూ పార్టీకి హాజరైన అందరినీ నవ్వించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


 

Allu Arjun - Allu Aravind

చెన్నైలో ఇద్దరు పోరంబోకులు (బన్నీ, దేవి) ప్రిన్సిపాల్ నుండి ఎప్పుడూ సర్టిఫికెట్ తీసుకొని మేము ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకుంటాం అనుకున్నావా?#Pushpa2TheRule pic.twitter.com/eQPrvaFQsY

— M9.NEWS (@M9Breaking) October 22, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు