రూ.10 కోట్లు ఇస్తానంటే "పఠాన్‌" కోసం పని చేస్తానంటున్న హీరోయిన్! (video)

సోమవారం, 9 నవంబరు 2020 (13:24 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో దీపికా పదుకొనె ఒకరు. ఈమె స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న ఆమె.. తాజాగా మరో చిత్రానికి ఏకంగా రూ.10 కోట్ల మేరకు డిమాండ్ చేసిందట. ఆ చిత్రం పేరు "పఠాన్". 
 
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ దాదాపు రెండేళ్ళ విరామం తర్వాత నటిస్తున్న చిత్రం. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జాన్‌ అబ్రహమ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 
 
ఇందులో షారూక్ సరసన దీపికాను ఎంపిక చేయగా, ఆమెకు పది కోట్ల రూపాయల మేరకు పారితోషికం చెల్లిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, తెలుగులో కూడా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించే చిత్రంలో కూడా దీపికాను ఎంపిక చేయగా, ఈ చిత్రం కోసం రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు పారితోషికం వసూలు చేయనున్నట్టు సమాచారం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు