మరోవైపు వర్మ నిబద్ధతకు ఎవరూ ఓటు వేయడంలేదు. గతంలో పరిశ్రమపై అలిగి ముంబై వెళ్ళి పోయి తిరిగి వచ్చి దెయ్యం, భూతం, ఫ్యాక్షన్ గొడవలతో సినిమాలు తీశాడు. వాస్తవికత కథ అన్నా అందులో అవాస్తవం వుండడంతోపాటు నా సినిమా నా ఇష్టం చూస్తే చూడండి. లేదంటే లేదనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. నేనేమీ సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలు తీయడంలేదని బాహాటంగానే అన్నాడు.
ఇక ఇటీవలే వోడ్కా తాగుతూ, మహిళలతో డాన్స్‌లు వేస్తూ, ఎవరి అభిరుచి వారిది. నా రూటు ఇది .అంటూ మాట్లాడిన వర్మను ఎవరు పట్టించుకుంటారనే ప్రశ్న కూడా వుంది. మరో విశేషం ఏమంటే, ఒక్కోసారి నిన్న మాట్లాడింది ఈరోజు మారిపోతందనే నిసిగ్గుగా గతంలో చెప్పాడు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు రూల్స్ మాట్టాడడం చాలామందికి రుచించడంలేదు. అందులోనూ పరిశ్రమలో నువ్వా? నేనా? అన్న రీతిలో పెద్దలు వుంటే, వర్మను ఎలా నమ్మగలరని సీనియర్ నిర్మాత తెలియజేస్తున్నారు. ఇటువంటి సమస్యలు ఛాంబర్ చూసుకొంటుందనీ, దానికి అనుగుణంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని సి.కళ్యాణ్, దిల్ రాజు వంటి వారు కూడా చెప్పారు.
ఇక ఇలా ప్రశ్నలతో మంత్రిని సంధించిన వర్మ తాజాగా ఓ టీవీ ఇంటర్వూలో జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మంచి నిబద్ధతగల నాయకుడు అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం. దీంతో వర్మ యూ టర్న్ తీసుకున్నాడని అనుకోవాల్సి వస్తుందని ఫిలింనగర్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరి సంక్రాంతి తర్వాత సినిమా సమస్యలపై కొలిక్కి రావచ్చని తెలుస్తోంది.