'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

గురువారం, 1 డిశెంబరు 2016 (21:18 IST)
'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు.. మురుగదాస్‌ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి చిత్రం కొరటాల శివ, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్‌ ఒక సినిమా చేయనున్నాడు. 
 
అయితే ఈ సినిమా పీవీపీ బ్యానర్‌‌లో తెరకెక్కుతుందని మొదట్లో ప్రకటించారు. అయితే మహేశ్‌ ఇప్పుడు ఈ ప్రాజెక్టును దిల్‌ రాజు చేతిలో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్‌ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి దిల్‌ రాజు నిర్మాత. ఆ కాంబినేషన్‌తో దిల్‌రాజు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి