విలక్షణమైన దర్శకత్వంలో ముందుకు వెళ్ళడం దర్శకుడు తేజకు అలవాటు. చిన్న సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్న దర్శకుల్లో తేజ ఒకరు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి ఎక్కువ రాబడిని గడించడంలో తేజ సిద్ధహస్తుడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఉదయ్ కిరణ్, నితిన్, సదా, నవదీప్, నందిత, కాజల్ ఇలా ఒక్కరు కాదు.. ఎంతోమంది కొత్త నటీనటులకు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది తేజానే. అలాంటి తేజ ఇప్పుడు సినిపరిశ్రమలో మరో నటుడు కుమార్తెను తెలుగుతెరకు పరిచయం చేయబోతున్నారు...
ఇందులోభాగంగా తేజ కన్ను ఓ సీనియర్ హీరో కూతురిపై పడింది. హీరో రాజేశేఖర్, నటి జీవిత కూతురు శివానీని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తేజ తీసుకున్నట్టు సమాచారం. కుదిరితే ఈ ఏడాదిలోనే శివానీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు తేజ ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం రానా - కాజల్ హీరోహీరోయిన్లుగా ఓ పొలిటికల్ సెటైరికల్ సినిమా తెరకెక్కిస్తున్నాడు తేజ. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే, శివాని సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానా లేక రొమాంటిక్ ఎంటర్టైనరా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.