అపరిచితులతో శృంగారం చేసేటపుడు అది చూసుకోవాలి కదా: పాయల్ రాజ్

శనివారం, 14 సెప్టెంబరు 2019 (15:22 IST)
శృంగార సన్నివేశాల్లో ఇరగదీసే నటి పాయల్ రాజ్‌పుత్. RDX Love చిత్రంలో తను నటించిన సన్నివేశాల గురించి బహిరంగంగా చర్చించేందుకు ఎలాంటి జంకు తనకు లేదని అంటోంది. అంతేకాదు... పీరియడ్స్, సెక్స్, సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ తదితర విషయాలపై మాట్లాడేందుకు చాలామంది విపరీతంగా సిగ్గుపడతారు.
 
అది జీవితంలో భాగం కదా. దాని గురించి మాట్లాడేటపుడు ఎందుకంత సిగ్గు. ఈ విషయంలో మేము చాలా ఓపెన్‌గా చర్చించాం. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పడే కష్టాలు గురించి... అలాగే సెక్స్, శృంగారానికి ముందు వాడే కండోమ్స్... ఇలా అన్నింటిపైనా అవగాహన తెచ్చే విధంగా సినిమా తెరకెక్కింది.
 
ఎవరైనా అపరిచితులతో శృంగారం చేయాల్సి వచ్చినప్పుడు కండోమ్స్, సురక్షిత మార్గాలపై ఆలోచించడంలో తప్పు లేదు కదా. ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా వుంటే ఇరువురి జీవితాలకు అది ఎంతో సేఫ్. శృంగారంలో పాల్గొన్న తర్వాత ఆ సమస్యా... ఈ సమస్యా అనుకునే కంటే, కండోమ్ వాడితే ఇక దేని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ చెప్పుకొచ్చింది పాయల్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు