నందమూరి నట సింహం బాలకృష్ణ గుండుతో ఉన్న స్టిల్ బయటకు వచ్చింది. ఈ స్టిల్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది. దీంతో ఎందుకు బాలయ్య గుండు గెటప్‌లో దర్శనిమిచ్చాడు. సినిమా కోసం గెటప్పా..? లేక వేరే కారణం ఏమైనా ఉందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించారు.
ఈ సినిమాలో బాలయ్యకు విగ్గు కరెక్ట్‌గా సెట్ కాలేదు. దీంతో తదుపరి సినిమా లుక్ విషయంలో బాలయ్య చాలా కేర్ తీసుకుంటున్నారట. బోయపాటి కూడా బాలయ్య లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. అయితే... బాలయ్య గుండుతో ఉన్న స్టిల్ బయటకు రావడం.. ఇంతకుముందు ఎన్నడూ బాలయ్యను ఇలా చూసి ఉండకపోవడంతో... ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.