సౌదాగర్ చిత్రంలో మనీషా కొయిరాలా నటించింది. ఈ చిత్రాన్ని సుభాష్ ఘయ్ రూపొందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మనీషా కొయిరాలకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత క్రమంగా సుభాష్ తనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనీషాతో కలిసేవాడని ప్రచారం జరిగింది. అంతేకాదు.. సౌదాగర్ చిత్రం షూటింగ్ సమయంలో వ్యానిటీ వేనులో మనీషా కొయిరాలాను మాత్రమే ఒంటరిగా వుంచి ఆమె తల్లిని వ్యాను నుంచి కిందికి దింపేసేవాడట. ఆ తర్వాత గంటలకొద్దీ ఆమెతో ఒంటరిగా వుండేవాడట.
ఆ సమయంలోనే మనీషా కొయిరాలపై లైంగిక దాడి చేసాడనే కామెంట్లు అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై మనీషా కొయిరాలా మాట్లాడకపోయినప్పటికీ ఆమె తల్లి మాత్రం సుభాష్ ఘయ్ పైన ఆరోపణలు చేసింది. కానీ ఇది నిజమేనంటూ మనీషా ఇప్పటివరకూ చెప్పలేదు. కానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డానే ఆరోపణ మాత్రం సుభాష్ పైన అలాగే వుంది.
దీని గురించి మనీషాను కదిలిస్తే... తను చిత్ర పరిశ్రమకు చెందినదాన్ని కాదనీ, ఇక్కడ తెలివిగా ఎలా వుండాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ సుభాష్ ఘయ్ అత్యాచారం చేశాడా అనే దానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు.