బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ కుమార్తె త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతుందనే వార్తలు బిటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుహానా లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. అక్కడ పర్యాటక ప్రదేశాలను తన తల్లి గౌరీఖాన్‌తో కలిసి చూసొచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.