రాశీఖన్నాను గోపీచంద్‌ ఏంచేశాడో!

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:12 IST)
నటి రాశీఖన్నా తాను చాలా నేర్చుకున్నాననీ.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ధైర్యం ఎదుర్కొనేలా శక్తిని పొందగలిగానని చెబుతోంది. 'ఊహలు గుసగుసలాడే'.. చిత్రానికి ఇప్పటికీ చాలా భౌతికంగా మార్పు వచ్చిన ఆమెకు.. మానసికంగా కూడా మార్పు వచ్చిందట. ఇంతకుముందు కొన్ని విషయాల్లో భయపడేదాన్ని.. రానురాను అనుభవం వల్ల వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నాననంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 
 
కొన్ని సినిమాలే చేయాలనే రూల్స్‌ పెట్టుకుని వాటినే చేయగలనుకున్నా.. కానీ కథలపరంగా మంచివి ఎంచుకోవడంలో ఇప్పటికి క్లారిటీ వచ్చిందని చెబుతోంది. హీరో గోపీచంద్‌తో చేస్తున్న 'ఆక్సిజన్‌' సినిమా తన నిర్ణయం కరెక్ట్‌ అని తెలుస్తోందని అంటోంది. మరి గోపీచంద్‌ ఏ ఆక్సిజన్‌ ఇచ్చాడో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి