హీరో ప్రశాంత్. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. లోగడ 'తొలిముద్దు', 'ప్రేమఖైదీ', 'జీన్స్' వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈయన గత 2005లో అతడు గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అయితే, ఈయన ఇటీవలే తన భార్య గృహలక్ష్మికి విడాకులు ఇచ్చారు. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణాన్ని హీరో బహిర్గతం చేశారు.