బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి రిలీజైన తొమ్మిది రోజుల్లోనే రూ.1000 కోట్ల రికార్డును సృష్టించింది. ఈ సినిమాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూశారట. అది కూడా సినిమా రీలిజ్ అయిన రెండో రోజే చూడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్రంప్ బాహుబలి 2 సినిమాను చూశారని చెప్పింది ఎవరో కాదు.
ప్రపంచాన్ని తానే నడిపిస్తున్నానని చెప్పుకునే ధైర్యం గల ది వన్ అండ్ ఓన్లీ పర్సన్ కేఏ పాల్ ఈ విషయాన్ని ట్వట్టర్ ఫేజ్ ద్వారా తెలిపాడు. బాహుబలి 2 సినిమాను ట్రంప్‌తో పాటు, ట్రంప్ కూతురు ఇవాంక కూడా చూసారని, వారిద్దరు సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నారు. పైగా ఇలాంటి అద్భుతాన్ని సాక్షాత్కారం చేసినందుకు.. కె ఏ పాల్ ట్రంప్ అభినందనలు తెలిపాడట.