విప్పి చూపేందుకు నేను సిద్ధం.. చాన్సులిచ్చేందుకు ఎవరైనా ఉన్నారా? హీరోయిన్ నందిత

శనివారం, 14 జనవరి 2017 (09:06 IST)
హీరోయిన్ నందిత. 'నీకు నాకు డాష్ డాష్' అంటూ టాలీవుడ్ వెండితెరపై మెరిసింది. ఈ చిత్రాని తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూడటంతో నందిత కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' సూపర్ హిట్ కావడంతో నందితకి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ 'ప్రేమకథా చిత్రమ్' తర్వాత అంతటి హిట్ సినిమా తన ఖాతాలే లేదు. సుధీర్ బాబుతో చేసిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ', సుమంత్ అశ్విన్‌తో చేసిన "లవర్స్" వంటి చిత్రాలు సుమారుగానే ఆడాయి.
 
ఆ తర్వాతే నందిత ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. దీంతో నందిత ఇక నటించదని.. సినిమాలకి గుడ్‌బై చెప్పేసిందని టాలీవుడ్‌లో ప్రచారం సాగింది. ఈ విషయంపై నందిత రీసెంట్‌గా స్పందించింది. నేను సినిమాలకి గుడ్ బై చెప్పేశాననే ప్రచారం అబద్దం. సినిమాల్లో నటించడానికి నేను సిద్ధం. వెండితెరపై అందాలు ఆరబోసేందుకు కూడా సై. కానీ, నాకు అవకాశాలు ఇచ్చేవారు ఎవరున్నారు. అందుకే చిత్రాలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్టు ఈ సొట్టబుగ్గల సుందరి. 

వెబ్దునియా పై చదవండి