షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించాలనుంది.. కానీ ఆయన అలా అనుకోవాలి కదా?: సోనమ్ కపూర్

గురువారం, 3 నవంబరు 2016 (12:10 IST)
అప్పుడప్పుడూ ఘాటు స్టేట్‌మెంట్లతోనూ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోంటుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు సులువుగా వచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారని, కానీ అది తప్పని అంటోంది. నిజానికి తాను అనిల్ కపూర్ కుమార్తె కావడం వల్లే చాలా అవకాశాలు చేజారాయని నిట్టూరుస్తోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో నటించాలనే కోరిక తనకు ఎప్పటినుందో ఉందని తెలిపింది. అయితే, తనతో నటించాలనే ఉద్దేశం ఆయనకు ఉందని తాను భావించడం లేదని అంటోంది. "షారుఖ్‌తో కలసి నటించేందుకు నాకు చాలా అవకాశాలు వచ్చాయి.

నాకు కూడా ఆయనతో కలసి పని చేయాలనే కోరిక ఉంది. అయితే, నాతో కలిసి పనిచేయాలని ఆయన ఎప్పుడు అనుకుంటారో... అప్పుడే అది సాధ్యమవుతుందని తన మనసులోని మాటను బయటపెట్టింది. సినిమాలో ఏ హీరోయిన్‌తో కలిసి నటించాలి అనేది హీరోపైనే ఆధారపడియుంటుందని.... సినీ రంగంలో ప్రస్తుతం అదే జరుగుతోంది" అని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి