నేను నోరు విప్పితే అక్కినేని పరువు పోతుంది: దాసరి వెల్లడించని రహస్యం

బుధవారం, 25 జనవరి 2017 (07:31 IST)
దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ ఎన్ని సూపర్ హిట్ సినిమాలను అదించిందో అలనాటి తరం ప్రేక్షకులకు బాగానే తెలుసు. ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, మేఘసందేశం, రావణుడే రాముడైతే వంటి బంపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి అప్పట్లో చరిత్ర సృష్టించాయి. కానీ వీరిద్దరి మధ్య ఘర్షణలు ఉండేవని చాలా కొద్దిమందికే తెలుసు. 
 
అక్కినేని నాగేశ్వరరావు తనను ఒక సందర్భంలో ఘోరంగా అవమానించారని, ఆనాటి నుంచి తమమధ్య సంబంధాలు సరిగా లేవని దాసరి చెప్పారు. ఆ తర్వాత అక్కినేనితో సత్సంబంధాలకు కూడా ప్రయత్నించలేదన్నారు. అక్కినేని ప్రవర్తన తనను చాలా బాధపెట్టించిందన్నారు. కానీ ఆ విషయాన్ని నేను బయటకు వెల్లడిస్తే అక్కినేని నాగేశ్వరరావుపై ప్రజలకు ఉన్న గౌరవం మొత్తం పోతుందని దాసరి తెలిపారు.
 
అక్కినేని అంటే నాకెంతో గౌరవం. ప్రజలు సైతం ఆయనను అమితంగా గౌరవిస్తారు. ఆయన గురించిన రహస్యాన్ని నేను బయట పెట్టినట్లయితే అక్కినేనిపై ప్రజలు పెట్టుకున్న గౌరవం సగం వరకు తగ్గిపోతుంది అని దాసరి చెప్పారు. అక్కినేనిని గౌరవించినంతగా నేను మరెవరినీ గౌరవించలేదు. కానీ అయన నన్ను అవమానించారు. ఆ విషయాన్ని నేను జీవితంలో ఎన్నడూ బయట పెట్టలేను. అలాగని ఆయన తనకు చేసిన అవమానాన్ని కూడా జీవితంలో మర్చిపోలేను అని దాసరి చెప్పారు.
 
దాసరి ఇంత స్పష్టంగా అక్కినేని చేసిన అవమానం గురించి ఎన్నడూ బయటపెట్టనని చెప్పారు కనుక ఇక అది శాశ్వత రహస్యమే.

వెబ్దునియా పై చదవండి